సారథిన్యూస్, హైదరాబాద్: ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఉద్యమంలా కొనసాగుతున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఆయన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి ఆలయ ప్రాంగణంలోనూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. మర్రి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి. మున్సిపల్ చైర్మన్లు. సర్పంచులు. ప్రజా ప్రతినిధులు. ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- June 19, 2020
- Archive
- హైదరాబాద్
- GREEN CHALLENGE
- HYDERABAD
- SANTOSH KUMAR
- ఉద్యమం
- మల్లారెడ్డి
- Comments Off on ఉద్యమంలా గ్రీన్ ఛాలెంజ్