బారాముల్లా: జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని నౌగామ్‌లో సెక్యూరిటీ ఫోర్స్, టెర్రరిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. లైన్‌ఆఫ్ కంట్రోల్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గమనించిన సెక్యూరిటీ ఫోర్స్ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. మరికొంత మంది తప్పించుకున్నారనే అనుమానంతో ఏరియా మొత్తం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. వారి నుంచి ఏకే 47 గన్‌తో పాటు కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మొదటి నుంచి పాకిస్తాన్ వేలాది మంది టెర్రరిస్టులను ఇండియాలోకి పంపిందని, ఇప్పటి వరకు చాలా మందిని మట్టుబెట్టామని ఆర్మీ అధికారులు చెప్పారు.
- July 11, 2020
- Archive
- జాతీయం
- షార్ట్ న్యూస్
- BARAMULLA
- IR
- JAMMUKASH
- NOWGAM
- జమ్మూకాశ్మీర్
- పాకిస్తాన్
- బారాముల్లా
- Comments Off on ఇద్దరు టెర్రరిస్టుల హతం