సారథిన్యూస్, రామడుగు: ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్‌స్నాచింగ్ పాల్పడుడుతున్న ఇద్దరు దొంగలను రామడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 51 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన వేముల రమేశ్(23), వేముల నర్సింహులు(19) జల్సాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఎస్సై అనూష రామడుగు చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా వీరిద్దరు అనుమానస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు చేసినట్టు అంగీకరించారు. దీంతో వీరిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- July 11, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- CHAIN SNACHERS
- Comments Off on ఇద్దరు చైన్ స్నాచర్స్ అరెస్ట్