గద్దల కొండ గణేష్ చిత్రంలో వెల్లువొచ్చి గోదారమ్మ.. పాటలో, శ్రీదేవి పాత్రలో మస్త్ కిక్కిచ్చిన భామ పూజాహెగ్డే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో ఒరు. ఆ తర్వాత పూజ అలవైకుంఠ పురములో ‘నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు..’ పాటతో మరింత కిర్రెక్కించింది. ప్రస్తుతం‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ తో తీస్తున్న సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది.
అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో కూడా కమిటైంది ఈ పొడుగుకాళ్ల సుందరి. ఇప్పుడేమో ‘మహానటి’ సినిమాలో కీర్తిసురేష్ కు జోడీగా చేసిన దుల్కర్ సల్మాన్ సినిమాలో చేయనుందట. కానీ దుల్కర్ తెలుగులో డైరెక్ట్ మూవీ చేయలేదు. అందాల రాక్షసి ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి నెక్ట్స్ మూవీతో దుల్కర్ హీరోగా కన్ఫామ్ చేస్తూ, హీరోయిన్ పూజకు కథ వినిపించాడట. కానీ పూజ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఆమె ఓకే చేస్తే సినిమా పట్టాలెక్కడం ఖాయమేనట.