Breaking News

ఇండియాకు ఆనంద్

బెంగళూరు: కరోనా కారణంగా మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు భారత్​కు చేరుకున్నాడు. శుక్రవారం ఫ్రాంక్​ఫర్ట్​ నుంచి బయలుదేరిన విషీ శనివారం బెంగళూరుకు వచ్చాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తిచేసుకున్న తర్వాత ఆనంద్ చెన్నైకి వస్తారని అతని భార్య అరుణ తెలిపారు. బుండెస్లిగా టోర్నీ కోసం ఫిబ్రవరిలో ఆనంద్ జర్మనీకి వెళ్లాడు. మార్చిలో స్వదేశానికి రావాల్సి ఉన్నా కరోనా లాక్​ డౌన్​, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించడంతో అక్కడే ఉండిపోయాడు. ప్రొటోకాల్‌ ప్రకారం బెంగళూరులో దిగిన అంతర్జాతీయ ప్రయాణికులను ఏడు రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉంచుతామని కర్ణాటక హెల్త్‌ డిపార్ట్​మెంట్​ అధికారులు తెలిపారు. కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన తర్వాత మరో 14 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలన్నారు.