వాషింగ్టన్: భారత్‌లో చైనా యాప్‌లను నిషేధించడం సరియైన చర్యేనని అమెరికా సమర్థించింది. టిక్‌టాక్, షేర్ఇట్ సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పందించారు. సమగ్రత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్‌లో కొన్ని హానికరమైన యాప్‌లను నిషేధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత్‌లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్ స్పందించారు. ఈ వ్యవహారంపై తమ దేశం తీవ్రంగా కలత చెందుతోందని, ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.
- July 2, 2020
- Archive
- జాతీయం
- CHINA
- SHAREIT
- TIKTOK
- US
- WASHINGTON
- అమెరికా
- యాప్
- Comments Off on ఆ యాప్‌ల నిషేధం కరెక్టే