Breaking News

ఆ చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమే..

ఆ చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమే..

బీజింగ్‌: టిక్‌టాక్ సహా 59 ప్రధాన మొబైల్‌యాప్‌లను ఇండియా నిషేధించడంపై చైనా స్పందించింది. ఈ చర్య తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ఇంటర్​నేషనల్‌గా ఆయా దేశాల నియమ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని కంపెనీలకు చైనా చెబుతుందన్నారు. చైనా సహా ఇంటర్​నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌లకు హక్కులు కల్పించాలని అన్నారు. యాప్స్‌ నిషేధించడం చైనా ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టడమే అని, దానికి చైనా ఆందోళన చెందుతూ ఇలాంటి కామెంట్స్‌ చేస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. యూజర్స్‌ సేఫ్టీకి భంగం కలుగుతోందనే ఆరోపణలతో మన దేశంలో చైనాకు చెందిన 59 యాప్స్‌ను బ్యాన్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది యూజర్లు ఉన్న టిక్‌టాక్‌ను కూడా చైనా బ్యాన్‌ చేసింది. షేర్‌‌ఇట్‌, యూసీ బ్రౌజర్‌‌ లాంటి యాప్స్‌పై కూడా నిషేధం విధించింది.