ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీలో తమన్నా ఓ టాక్షో చేయనున్నట్టు సమాచారం. ఇందుకు బన్నీ ఆమెను ఒప్పించాడని టాక్. కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు ఒపెన్ కావడం కష్టమే. ఈ నేపథ్యంలో తారలందరూ ఓటీటీ వెంట పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఆర్జీవీ అయితే ఓటీటీని ఓ రేంజ్లో వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలు తగ్గిన మిల్కీ బ్యూటీ ఆహాలో టాక్ షోలో వ్యాఖ్యాతక చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ షోలో కూడా తమన్నా అందాలు ఆరోబోస్తుందట. అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమన్నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతున్నారట. ఈ షోకోసం తమన్నా భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నయి.