సారథిన్యూస్, ఖమ్మం రూరల్: ఆలయభూముల్లో అక్రమనిర్మాణాలను తొలగించి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అఖిలభారత బ్రాహ్మణ సర్వీస్ నెట్వర్క్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రంగారావు, రావులపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దేవాలయ భూములను దేవాదాయశాఖ అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దేవాలయ ఆస్తులను కబ్జాలు చేయడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. సంగమేశ్వర ఆలయానికి చెందిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపించారు. కాగా దేవాదాయశాఖ అధికారులు అతడికి సహకరిస్తున్నారని ఆరోపించారు.
- June 15, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KAMMAM
- LAND
- SANGHAMESHWARA TEMPLE
- TEMPLE
- దేవాదాయశాఖ
- ధారాదత్తం
- Comments Off on ఆలయభూములు అన్యాక్రాంతం