Breaking News

ఆర్​బీకేలతో విప్లవాత్మక మార్పులు

  • ఆంధ్రప్రదేశ్​ సభాపతి తమ్మినేని

సారథి న్యూస్, శ్రీకాకుళం: రైతుభరోసా కేంద్రాలు (ఆర్​బీకే)రైతులకు బాసటగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్​ శాసనసభ స్పీకర్​ తమ్మినేని సీతారాం అన్నారు. గ్రామీణ వ్యవస్థలో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని వివరించారు. ఆమదాలవలస మండలం తొగారాం గ్రామంలో శనివారం ఆయన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే వైఎస్సార్​ క్లినిక్​ సెంటర్లు ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు.

జిల్లాలో రూ.9.7 కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో సమీకృత ల్యాబ్​లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుభరోసా కింద జిల్లాలో 2020-21 సంవత్సరానికి 3,63,912 మంది రైతులకు మొదటి విడత రూ.272.91 కోట్లు పంపిణీచేయగా, ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలో 32,058 మంది రైతులకు రూ.26.27 కోట్లు అందించామని వివరించారు. ఈ సందర్భంగా ఉద్యానపంటలపై రూపొందించిన పుస్తకాలు, కరపత్రాలను స్పీకర్​ ఆవిష్కరించారు. కృషివిజ్ఞానకేంద్రం రూపొందించిన పోస్టర్ ను విడుదల చేశారు. రైతులు 1800 425 3141 టోల్ ఫ్రీ నంబర్​కు ఫోన్ చేసి పంటల వివరాలు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ జె.నివాస్, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకుడు పి.లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.