సారథి న్యూస్, ఖమ్మం: బహుభాషా కోవిదుడు, సరళీకరణ ఆర్థిక విధానాలు, లుక్ ఈస్ట్ పాలసీతో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవచేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. కష్టకాలంలో ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టి ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి సేవలను కొనియాడారు.
- June 28, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KHAMMAM
- MALLU
- PV
- పీవీ
- మల్లు భట్టి విక్రమార్క
- Comments Off on ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారు