సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాయాలను కాగిత రహిత(ఈ ఆఫీస్) ఆఫీసులుగా మార్చాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. శనివారం కలెక్టరేట్ లో ఈఆఫీస్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని పనులకు పేపర్లను వినియోగిస్తున్నామని చెప్పారు. మెదక్ కలెక్టరేట్‌ను ఈఆఫీస్ గా మార్చామన్నారు. ఈసేవ, మీ సేవ తరహాలోనే వీటిని నిర్వహించాలన్నారు. అధికారులు సంతకాలను సైతం డిజిటల్ సిగ్నేచర్ కీ (డీఎస్కీ) తయారు చేయించాలని, ఏదైనా సంతకం ఉంటే ఆన్లైన్లోనే లాగిన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఐసీ జిల్లా మేనేజర్సందీప్, ఐటీఈ అండ్సీ డిపార్టుమెంట్, ఎన్ఐసీ సిబ్బంది పాల్గొన్నారు.
- August 15, 2020
- Archive
- Top News
- ముఖ్యమైన వార్తలు
- మెదక్
- లోకల్ న్యూస్
- E-OFFICE
- MEDAK COLLECTORATE
- అడిషనల్కలెక్టర్
- ఈఆఫీస్
- మెదక్ కలెక్టరేట్
- Comments Off on ఆఫీసుల్లో కాగిత రహిత సేవలు