Breaking News

ఆఫీసుకు వస్తే మాస్క్​ ఉండాలె

సారథి న్యూస్​, కౌడిపల్లి: వివిధ అవసరాలకు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్​ కట్టుకోవాలని మెదక్​ అడిషనల్​ కలెక్టర్​ నగేష్ సూచించారు. శనివారం కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసును సందర్శించారు.వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సేకరించిన భూములను ఇరిగేషన్​ శాఖ పేర బదిలీచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్​ రాణా ప్రతాప్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి ఉన్నారు.