కర్నూలు: ఆన్‌లైన్ క్లాసెస్ వింటున్న విద్యార్థినులు ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఓ స్కూలుకు సంబంధించిన బాలికల వాట్సప్ గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో కంగుతిన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూలు విద్యార్థినులకు ఆన్‌లైన్ తరగతుల కోసం ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటుచేశారు. 8వ తరగతి విద్యార్థినులకు చెందిన ఆ గ్రూపులో ఇటీవల గుర్తుతెలియని ఓ వ్యక్తి అశ్లీల వీడియోను పోస్టుచేశాడు. ఆ గ్రూపులో ఆ వీడియో రెండు రోజుల పాటు అలాగే ఉంది. టీచర్లు కూడా దాన్ని పట్టించుకోకపోవడం, ఎవరూ దాన్ని తొలగించకపోడంతో విద్యార్థినులు పలువురు విద్యార్థి సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఎంఈవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఆ వీడియోను పోస్టు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, కొద్దినెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పాఠశాల బాలికల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ ఆన్‌లైన్ క్లాసుల గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమైంది. దీనిపై స్వయంగా ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వీడియో షేర్ చేసిన నంబర్లను గుర్తించి ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు.
- August 19, 2020
- Archive
- కర్నూలు
- క్రైమ్
- Kurnool
- ONLINE CLASSES
- PATHIKONDA
- WHATSAPP GROUP
- అశ్లీలవీడియో
- ఆన్లైన్క్లాసెస్
- కర్నూలు
- Comments Off on ఆన్‌లైన్ క్లాసెస్.. విద్యార్థినులు షాక్