Breaking News

ఆన్​లైన్​ పాఠాలు సక్సెస్​

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లాలోని అన్నీ పాఠశాలల్లో ఆన్ లైన్ పాఠాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. స్థానిక జడ్పీ హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల్లో కూడా ఆన్ లైన్ తరగతుల పట్ల అవగాహన వచ్చిందన్నారు. స్కూలు తెరచిన తర్వాత సుమారు మూడువేల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోనో, లేక టీవీనో కొనుక్కోవడం చేశారని చెప్పారు. వారి పిల్లలకు ఆన్​లైన్ లో తరగతుల కోసం ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. టీచర్లు కూడా ఆన్ లైన్ తరగతులపై శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు.
ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
ఈ ఏడాది జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన స్థానిక జడ్పీ హిందీ టీచర్​ రఘునాథ్ రావు కులకర్ణిని డీఈవ ప్రశంసాపత్రం, శాలువా, జ్ఞాపిక తో సత్కరించారు. కార్యక్రమం లో సెక్టోరియల్ ఆఫీసర్ సుబాష్ జాదవ్, స్కూల్ హెడ్ మాస్టర్ కె.రాజేశ్వర్, మండల పీ‌ఆర్‌టీ‌యూ శాఖ అధ్యక్షుడు రామచంద్ర చారి, రాష్ట్ర అసోసియేటెడ్ ప్రెసిడెంట్ కేవీ రవీందర్, చంద్రప్రకాష్, బాయికాడి శ్రీనివాస్, టీచర్లు జనార్ధన్, కొండ శ్రీనివాస్, వెంకటేశం, విజయ్ కుమార్, దయానంద, సుభాష్, సుకన్య, జయప్రద, శైలజ, హరి పాల్గొన్నారు.