- గూగుల్‌పై మండిపడిన పేటీఎం
న్యూఢిల్లీ : ఆన్‌లైన్ బెట్టింగ్‌లను ప్రోత్సహించేలా ఉందంటూ ప్లేస్టోర్ నుంచి గతవారం భారత్‌కు చెందిన చెల్లింపుల యాప్ పేటీఎంను తొలగించిన గూగుల్‌పై ఆ సంస్థ తీవ్రఆరోపణలు చేసింది. భారత్‌లో చట్టాలను అతిక్రమిస్తూ.. ఇక్కడ డిజిటల్ ఎకో సిస్టమ్‌పై ఆధిపత్యం చెలాయించాలని గూగుల్ చూస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పేటీఎం బ్లాగ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఒక స్టార్ట్ప్గా దేశంలో చట్టాలకు లోబడి మేము వ్యాపారాలు చేస్తున్నాం. కానీ గూగుల్, దాని ఉద్యోగులు చేస్తున్న పాలసీలు మాత్రం దేశ చట్టాలను అతిక్రమించేలా ఉన్నాయి. అంతేగాక ఏకపక్షంగా వాటిని ఇక్కడ అమలు చేయాలని చూస్తోంది రాసుకొచ్చింది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారిలో ఆండ్రాయిడ్ ఫోన్లే 95 శాతం ఉన్నాయనీ, తద్వారా ఇక్కడి ప్రజలపై నియంత్రణ చెలాయిస్తోందని పేటీఎం తెలిపింది. ఇక్కడివారు తయారుచేస్తున్న యాప్‌లలో వస్తున్న ప్రకటనల ద్వారా వేల కోట్ల రూపాయాల ఆదాయం గూగుల్ పొందుతోందని పేటీఎం ఆరోపించింది.