Breaking News

ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ..

ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ..

మైఖేల్ జార్డన్.. బాస్కెట్ బాల్ ప్రేమికులకు అతనొక దేవుడు. అమెరికాలో పుట్టిన నల్లజాతీయుడు. 1963లో న్యూయార్క్​ లోని ఒక స్లమ్ లో పుట్టాడు. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు సంతానం. మైఖేల్ బాల్యం మొత్తం పేదరికం, వర్ణవివక్షలోనే గడిచింది. కానీ మైఖేల్ తండ్రి మాత్రం కొడుకులో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషిచేసేవాడు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన ప్రపంచమంతా తెలుసు. మైఖేల్ కు 13ఏళ్లు ఉన్నప్పుడు ఆయన తండ్రి ఒకసారి తన వద్దకు పిలుచుకున్నాడు. ‘ఈ పాత షర్ట్ తీసుకెళ్లి రెండు డాలర్లకు అమ్ముకుని రా’ అని అన్నాడు. ఒక్క డాలర్ కు కొన్న షర్ట్ ను రెండు డాలర్లకు ఎలా అమ్మలోనని లోచించాడు మైఖేల్. అంతేతప్ప ఇది సాధ్యమయ్యే పనికాదని ఎప్పుడూ అనుకోలేదు. ఏదిచేసినా నమ్మకంగా చేయడం మైఖేల్ కు అలవాటు. బాగా ఆలోచించి.. ఆ షర్ట్ ను బాగా ఉతికి ఇస్త్రీచేశాడు. తెల్లవారుజాఉనమున రైల్వేస్టేషన్ కు వెళ్లి రెండు డాలర్లకు అమ్మి ఆ డబ్బును వాళ్ల నాన్నకు తెచ్చి ఇచ్చాడు. కొడుకు చేసిన పనిని ఆ తండ్రి మెచ్చుకున్నాడు.

నాలుగు రోజుల తర్వాత మళ్లీ పిలిచి ఇంకో షర్ట్ చూపించాడు. అది కూడా ఒక డాలర్ పెట్టి కొన్న షర్ట్. దాన్ని చూపించి 20 డాలర్లకు అమ్మమన్నాడు. అప్పుడు కూడా మైఖేల్ ఎలా అమ్మలోనని బాగా ఆలోచించాడు తప్ప తన నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. ఎలాగని బాగా ఆలోచించి ఆ షర్ట్ పైన తన ఫ్రెండ్​ తో మిక్కీ మౌస్ బొమ్మ వేయించాడు. ఆ షర్ట్ పట్టుకుని ఒక స్కూలు ఎదుట నిల్చున్నాడు. అటుగా వెళ్తున్న ఓ పిల్లాడు దాన్ని తన తండ్రికి చూపించి కొనమన్నాడు. అప్పుడు ఆ తండ్రి షర్ట్ కు 20 డాలర్లు, మైఖేల్ కు ఐదు డాలర్ల టిప్ ఇచ్చాడు. ఆ డబ్బు మొత్తాన్ని ఇంటికి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. అప్పుడు ఆ తండ్రి తన కొడుకు తెలివితేటలు, ఆత్మవిశ్వాసానికి ఎంతగానో పొంగిపోయాడు.

మైఖేల్ జార్డన్

ఆ తండ్రి మూడోసారి కూడా పిలిచి ఒక డాలర్ పెట్టి కొన్న ఇంకో షర్ట్ ను మైఖేల్ కు ఇచ్చాడు. ఈసారి దాన్ని రెండొందల డాలర్లకు అమ్ముకుని రమ్మన్నాడు. అదే ఆత్మవిశ్వాసంతో సరేనన్నాడు. ఎలాగని అని బాగా ఆలోచించాడు. అయితే హాలీవుడ్ అందాల నటి ఫరాఫాసెట్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం నగరానికి వస్తోందని తెలిసింది. వెంటనే ఆ షర్ట్ పట్టుకుని ట్రైన్ లో నగరానికి చేరుకున్నాడు. ఆమె చుట్టూ ఉన్న గుంపును తోసుకుంటూ ఎలాగోలా తనను చేరుకుని ఆ షర్ట్ పైన ఆటోగ్రాఫ్ చేయించుకున్నాడు. తెల్లారి మార్కెట్ కు వెళ్లి హాలీవుడ్ అందాల నటి ఫరా సైన్ చేసిన టీషర్ట్ ‘కేవలం రెండొందల డాలర్లే’ అన్నాడు. ‘నాకు కావాలి.. నాకు కావాలి’ అంటూ పోటీపడి మరీ ఆ షర్టును ఒకరు నాలుగు నిమిషాల్లోనే రెండువేల డాలర్లు పెట్టి కొన్నారు.
మళ్లీ ఇంటికి వెళ్లి ఆ డబ్బును తండ్రి చేతిలో పెట్టాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు..‘నీకు తిరుగు లేదు మైఖేల్. జీవితంలో నువ్వు సాధించలేనిది’ ఏమీ లేదని మైఖేల్ జీవితం అలాగే సాగింది. ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయన్ని బాస్కెట్ బాల్ ఆటలో లెజెండ్ ను చేసింది. ఇలాంటి ఆత్మవిశ్వాసం అందరిలో ఉండాలి. అప్పుడే ఎందులోనైనా విజయం సాధించగలరు. నాకేమీ రాదు, నేనేమీ సాధించలేను అనుకుంటే.. ఎందులోనూ విజయం కాదు కదా. ప్రయత్నం కూడా చేయలేరు. అందుకే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధించగలమని మైఖేల్​ లైఫ్​ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.