![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/CHERRY-NAXALF.jpg?fit=385%2C316&ssl=1)
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ ఈ చిత్రంలో మాజీ నక్సలైట్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆచార్యలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తున్నది. త్వరలో ఫిల్మ్‌సిటీలో మొదలయ్యే షూటింగ్లో ఆమె పాల్గొననున్నది. రెజీనా ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.