పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీకి కమిటైనప్పటి నుంచీ వరుస సినిమాలను ప్రకటించేశాడు. ‘వకీల్ సాబ్’ సినిమా అయితే రిలీజ్‌కు రెడీ అయిపోతోంది కూడా. కానీ క్రిష్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ‘విరూపాక్ష’ టైటిల్‌తో రూపొందనున్న పిరియాడికల్ మూవీకి మాత్రం కరోనా చిక్కు వచ్చిపడింది. కోహినూర్ వజ్రం చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు క్రిష్. రియల్ లైఫ్ లొకేషన్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ గ్రాఫిక్స్ వర్క్స్‌పై అంతగా ఇంట్రెస్ట్ చూపించని క్రిష్ ఆలోచనలను కరోనాతో పరిస్థితులు తారమారుచేశాయి. దీంతో ఈ సినిమా పవన్ వాయిదా వేశాడంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టడం మొదలెట్టాయి. అయితే మలయాళ నటుడు జయరామ్ ఆ వార్తలకు చెక్ పెట్టాడు. ఒకప్పుడు కేవలం డబ్బింగ్ సినిమాల్లోనే కనిపించిన జయరామ్ ‘భాగమతి’ తర్వాత వరస తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు.
రీసెంట్గా ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కీలకపాత్ర పోషించారు కూడా. ఇప్పుడీ పవన్, క్రిష్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడట. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడిన ఆయన.. 18వ శతాబ్దానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోందని, పలువురు ప్రముఖ నటీనటులు కాంబినేషన్ లో సీన్స్ ఉన్నాయి.. కరోనా ఆంక్షలు ఎత్తేశాక షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది. ఇక విదేశాల్లో తీద్దామనుకున్న సీన్స్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలోనే సెట్స్ కు ప్లాన్ చేస్తున్నాడట క్రిష్. ఇప్పటివరకూ తన కెరీర్ లో దేనికదే డిఫరెంట్ మూవీ చేస్తున్న క్రిష్.. పవన్ తో ఎలాంటి సినిమా చేస్తాడో అనే ఆసక్తి నెలకొనడం సహజమే. కాన్సెప్ట్ ను బట్టి చూస్తూ పవన్ కళ్యాణ్ కెరీర్ కు ఇది కచ్చితంగా ఓ డిఫరెంట్ జానర్ మూవీ అవనుందేమో అనిపిస్తోంది.