Breaking News

ఆకతాయి తిక్క కుదిరే తీర్పు

ఇండోర్​ జడ్జి సంచలన తీర్పు

ఇండోర్​: ఓ పోకిరీ వేదవ తిక్కకుదిర్చేలా న్యాయమూర్తి వినూత్న తీర్పు చెప్పారు. దీంతో ఆ న్యాయమూర్తిపై సోషల్ ​మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జడ్జీగారు మీరు సూపరండీ అంటున్నారు యువత. ఇంతకు ఆ జడ్జీ ఇచ్చిన తీర్పు ఏమిటంటే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉజ్జ‌యిని న‌గ‌రానికి చెందిన విక్ర‌మ్ బాగ్రి అనే ఓ ఆకతాయి ఓ వివాహిత (30) ఇంట్లోకి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు యువకుడిని అరెస్ట్​ చేసి.. కేసు న‌మోదు చేశారు. నిందితుడు బెయిల్ కోసం ఇండోర్ కోర్టును ఆశ్ర‌యించాడు. ఇండోర్ కోర్టు న్యాయ‌మూర్తి రోహిత్ ఆర్యా కేసు పూర్వాప‌రాల‌ను పూర్తిగా అధ్య‌య‌నం చేశారు. సోమవారం ర‌క్షాబంధ‌న్ కావడంతో ఈ పండుగను దృష్టిలో ఉంచుకుని సంచ‌ల‌న తీర్పు చెప్పారు. ‘ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా విక్రమ్​ బాగీ.. తాను వేధించిన వివాహిత‌తో రాఖీ కట్టించుకోవాలి. అనంంతరం ఆమెకు రూ.11 వేలు ఇవ్వాలి. సోమవారం ఉదయం 11 గంటలకు నిందితుడు తన భార్యతో కలిసి వివాహిత ఇంటికి స్వీటు బాక్స్​తో వెళ్లాలి. బాధితురాలి కుమారుడికి రూ.ఐదువేలతో పాటు బట్టలు, స్వీట్లు కొనివ్వాలి. అలాగే వివాహిత కాళ్లమీద పడి ఆశీర్వాదం పొందాలి’ అంటూ తీర్పు చెప్పారు న్యాయమూర్తి.