ఇండియన్2, పుష్ప చిత్రాల్లో తాను స్పెషల్సాంగ్స్ చేయడం లేదని ఆర్‌ఎక్స్100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. తాను ఆ రెండు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానంటూ కొందరు పుకార్లు పుట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రస్తుతం నేను కొన్ని కథలు వింటున్నాను. కథ నచ్చితే సినిమా చేస్తాను. ఆ విషయాన్ని స్వయంగా నేనే ప్రకటిస్తాను. కాబట్టి అప్పటివరకు నా మీద అనవసర పుకార్లు పుట్టించి మీ సమయం వృథా చేసుకోకండి’ అంటూ ఆమె పోస్టులో పేర్కొన్నారు. పాయల్ రాజ్‌పుత్ ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ‘సీత’ (2019) చిత్రంలో ఓ స్పెషల్‌సాంగ్ చేశారు. లేటెస్ట్‌గా కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’, అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాల్లో ఆమె ప్రత్యేక పాటలు చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై పాయల్ స్పందించారు.
- July 6, 2020
- Archive
- సినిమా
- NEWMOVIE
- PAYALRAJPUTH
- PUSHPA
- RUMORS
- RX100
- పాయల్
- స్పెషల్ సాంగ్స్
- Comments Off on అవన్నీ పుకార్లే