బాలీవుడ్‌లోని బంధుప్రీతిపై కొంతకాలంగా కంగనారనౌత్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ స్టార్హీరోయిన్లు, దర్శక నిర్మాతలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే అవార్డుల గురించి మండిపడింది. అవార్డుల ఎంపికలోనూ బాలీవుడ్ ప్రముఖులు విధిగా బంధుప్రీతితోనే ఫాలో అవుతున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ‘దీపికా పదుకొనేకు గతంలో హ్యాపీన్యూ ఇయర్ అనే సినిమాకు అవార్డు వచ్చింది. కానీ ఆ అవార్డును దీపిక తీసుకోలేదు. నాకంటే క్వీన్‌లో కంగనా బాగా చేసిందని స్టేజీ మీదే చెప్పింది. అలియాభట్ మాత్రం ‘గల్లీభాయ్’ అనే సినిమాలో 10 నిమిషాల పాత్ర చేసి కొంచెం కూడా సిగ్గుపడకుండా అవార్డు తీసుకుంది’ అంటూ కంగనా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ కామెంట్లు బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి.
- July 20, 2020
- Archive
- సినిమా
- ALIA
- BOLLYWOOD
- COMMENTS
- KANGANA
- కంగనారనౌత్
- బంధుప్రీతి
- Comments Off on అలియాభట్ కు సిగ్గులేదు