న్యూఢిల్లీ: తాను ఒకప్పుడు బ్యాటింగ్ మార్చేసినట్లుగా ఇప్పుడు ఆడితే.. జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ప్రస్తుతం బ్యాట్స్ మెన్ల స్ట్రయిక్ రేట్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నాడు. ‘సుదీర్ఘంగా క్రీజులో పాతుకుపోవడం, బౌలర్లు అలసిపోయేలా చేయడం, బంతి పాతబడేలా చేసి ఆటను సులువుగా మార్చేయడం వంటి నేను చేశా. అది నా బాధ్యత కూడా. ఆ పనిని గర్వంగా భావిస్తా. అయితే నేను సెహ్వాగ్ లా భారీ షాట్స్ ఆడలేనని అర్థం కాదు. మ్యాచ్ కు తగినట్లుగా ముందుకెళ్లడం నా విధి. ఏకాగ్రత, పట్టుదల నా నైపుణ్యాలు. నేను వాటి మీదే దృష్టి పెట్టేవాడిని. వాస్తవానికి నాలాగా ఆడితే ఇప్పుడు మనుగడ కష్టమే. ఎందుకంటే ఈ రోజుల్లో స్ట్రయిక్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. వన్డేల్లో సచిన్, సెహ్వాగ్ స్థాయిని కూడా నేను అందుకోలేదు’ అని ద్రవిడ్ గుర్తు చేశాడు. కోహ్లీ, రోహిత్.. వన్డేలను మరో స్థాయికి తీసుకెళ్లారన్నాడు. ప్రస్తుతం క్రికెట్లో డిఫెన్స్ కు విలువ తగ్గినా.. వికెట్ కాపాడుకోవాలంటే దీనికి మించిన ఆయుధం మరోటి లేదన్నాడు. ఈ తరంలోని క్రికెటర్లకు డిఫెన్స్ టెక్నిక్ లేకోయినా.. ధనాధన్ బ్యాటింగ్తో కెరీర్ను నిర్మించుకోవచ్చన్నాడు.
- June 10, 2020
- Top News
- క్రీడలు
- DRAVID
- TEAMINDIA
- బౌలర్లు
- రాహుల్ ద్రవిడ్
- Comments Off on అలా ఆడితే.. మనుగడ కష్టమే