సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: ఈనెల 13, 14 తేదీల్లో అలంపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న స్వేరో సంబరాలను విజయవంతం చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బూడిదపాడ్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పరుగు పందెం, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్, కవితలు, పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం.. తదితర పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంబరాలకు బూడిదపాడ్, కలుగొట్ల గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ స్పోక్ పర్సన్ శేఖర్ బాబు, ఉమ్మడి జిల్లా అధ్యకుడు ప్రేమకుమార్, జిల్లా అధ్యక్షుడు కోళ్ల ఆనంద్, స్వేరోస్ స్టడీ సర్కిల్ జిల్లా అధ్యక్షుడు అంజయ్య,ఫిట్ఇండియా ఫౌండేషన్ డివిజన్ అధ్యక్షుడు కే.రవి కుమార్, ఆర్.ప్రభాకర్ పాల్గొన్నారు.
- January 6, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ALAMPUR
- FITINDIA
- SWAERO SAMBARALU
- అలంపూర్
- గురుకులాలు
- ఫిట్ ఇండియా ఫౌండేషన్
- స్వేరో సంబరాలు
- Comments Off on అలంపూర్‌లో స్వేరో సంబరాలు