సారథి న్యూస్, రామడుగు: చైనా కవ్వింపు చర్యలకు బలైపోయిన 20 మంది అమర జవానులకు రామడుగు పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా రామడుగు స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సరిహద్దులో శత్రుమూకలతో పోరాడి ప్రాణాలు అర్పించిన జవానుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. వారు కలలుగన్న లక్ష్యసాధనకు మనమంత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సై అనూష, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
- June 17, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- ARMY
- CHINA
- అమర జవాన్
- సరిహద్దు
- Comments Off on అమర జవాన్‌కు అశ్రునివాళి