సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తెలంగాణలోని పల్లెల్లో నేడు అభివృద్ధి పనులను చూసి వచ్చే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేయాలని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయ రామరాజు కోరారు. మంగళవారం దుబ్బాక నియోజకపరిధిలోని నార్సింగి మండల కేంద్రంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొందరు కేవలం ఎన్నికల సమయంలోనే పల్లెలకు వస్తూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. అభ్యర్థి ఎవరైనా టీఆర్‌ఎస్ బలపర్చిన వారికే ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో బీసీ సెల్ మండల నాయకులు పున్నయ్య ముదిరాజ్, నార్సింగి ఎంపీపీ సబిత, ఉపసర్పంచ్ యోగి, శంకరంపేట మాజీ ఎంపీపీ బాసాద రాజు, పున్నయ్య, పెద్దశంకరంపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేష్ గౌడ్, వెంకటరెడ్డి, భూమిరెడ్డి పాల్గొన్నారు.
- September 8, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- medak
- PEDDASHANKARAMPETA
- TRS DUBBAKA
- టీఆర్‌ఎస్
- తెలంగాణ
- పెద్దశంకరంపేట
- మెదక్
- Comments Off on అభివృద్ధిని చూసి ఓటేయండి