Breaking News

అప్పుడొస్తాడట..!

అప్పుడొస్తాడట..!

ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రామాయణం ఆధారంగా తీయనున్న ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వరుస అప్ డేట్స్ తో సర్​ప్రైజ్​చేస్తున్నారు టీమ్. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీమ్. గురువారం సినిమా విడుదల కానుండగా, వీకెండ్ సహా పంద్రాగస్టు కూడా కలిసివస్తోంది. ఐదు రోజులపాటు వరుస ఓపెనింగ్స్ ఉండడంతో పాటు రెండు రోజుల గ్యాప్ తో కృష్ణాష్టమి కూడా ఉంది. భారీ బడ్జెట్ తో త్రీడీలో రూపొందబోయే ఈ సినిమా షూటింగ్ మొదలు రిలీజ్ డేట్ వరకూ దర్శకుడు ఎంత క్లారిటీగా ఉన్నది ఈ అప్ డేట్స్ తో అర్థమవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’లో నటిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ నాటికి ఇది పూర్తవుతుంది. జనవరి నుంచి ‘ఆదిపురుష్’ షూటింగ్ లో జాయిన్ అవనున్న ప్రభాస్, అది పూర్తయ్యాక నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు.