Breaking News

అన్ని జాగ్రత్తలతో.. విత్తనాలు పంపిణీ

సారథి న్యూస్, నారాయణఖేడ్: సర్కార్ సబ్సిడీపై రైతులకు అందిస్తున్న సోయాబీన్ బస్తాలు కోసం గత శుక్రవారం కంగ్టిలో ఒకరికొకరు రైతులు తోసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్​లు కట్టుకోకుండానే విత్తనాల కోసం వచ్చారు. ఈ విషయమై ‘సారథి’లో ‘నో మాస్క్.. నో డిస్టెన్స్’ శీర్షిక వచ్చిన వార్తా కథనానికి స్థానిక అధికారులు స్పందించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో వ్యవసాయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్​లు తప్పనిసరిగా కట్టుకోవాలని రైతులకు సూచించడంతో వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. టోకెన్లు తీసుకుని.. క్యూ లైన్లలో నిల్చుని సోయాబీన్​ బ్యాగ్స్​ తీసుకెళ్లారు.