అటు బాలీవుడ్ లోనూ.. ఇటు సౌత్ జోన్ లోనూ సత్తా చాటుకున్న సినిమా ‘కేజీఎఫ్’. ఇప్పుడు దీని సీక్వెల్ కోసం ఆలిండియా వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్ 2’ లో ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దత్ సరసన రవీనాటాండన్ కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోసంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన ‘అధీరా’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. దీని గురించి డైరెక్టర్ ప్రశాంత్ చెబుతూ.. ‘అధీరా’ ను వైకింగ్స్ సిరీస్‌లో మెయిన్ క్యారెక్టర్ క్రూరంగా కనిపించే క్యారెక్టర్‌గా తీసుకున్నాం.
‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో భాగమైనందుకు దత్‌కు అభినందనలు తెలుపుతూ.. హ్యాపీ బర్త్ డే సంజయ్ బాబా. త్వరలో స్టార్ట్ అవబోయే మన క్రేజీ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాం..’ అని అన్నారు. ఈ పోస్టర్ లో సంజయ్ దత్ ‘అధీరా’ లుక్ లో భయంకరంగా కనిపిస్తున్నారు. ముఖం మీద టాటూ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. చేతిలో పెద్ద కత్తి పట్టుకుని ఆలోచిస్తున్నట్లు కూర్చున్నారు. మొత్తం మీద ‘అధీరా’ పాత్రను ‘రాకీ భాయ్’ పాత్రకు దీటుగా తీర్చిదిద్దారని ఫస్ట్ లుక్ లోనే తెలుస్తోంది. కోలార్ ఫీల్డ్ గనుల నేపథ్యంలో మాఫియా కథతో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని హెంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బాస్రుర్ సంగీతం అందిస్తున్నారు.