సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఎస్ఏఏఎఫ్) ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ‘టెక్నికల్ అఫీషియల్’ ఆన్ లైన్ సెమినార్, మే 18 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ‘స్టార్టర్స్’ ఆన్ లైన్ సెమినార్ లో గురుకులాల అసిస్టెంట్స్పోర్ట్స్ ఆఫీసర్, నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు పాల్గొన్నారు. సెమినార్లో ప్రతిభ చూపినందుకు గాను ఆయనకు నిర్వాహకులు ప్రశంసాపత్రం అందజేయగా.. ఈ మేరకు ఆయన గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నుంచి అందుకున్నారు. అసోసియేషన్ నాయకులు పరశురామ్, కోశాధికారి శ్రీను యాదవ్, శివ, స్వేరోస్ నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీ తరఫున డి.నాగేష్, పీఈటీ పి.అంజి, జి.విజయ్‌కుమార్, భీముడు, జి.బాల్‌జంగయ్య, కాటిక రామస్వామి, పాలెపు కొండల్, ఎండీ తురాబ్, కొమ్ము కృష్ణ, అలాగే బీఎస్పీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి పృథ్వీరాజ్, వర్కాల ధనుంజయ్, తోకల కృష్ణయ్య, పవన్ తదితరులు అభినందనలు తెలిపారు.
- September 25, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- RS PRAVEENKUMAR
- SOUTHASAIN ATHLETICS
- SWAEROES
- అథ్లెటిక్స్ అసోసియేషన్
- ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్
- ఏఎఫ్ఐ
- నాగర్ కర్నూల్
- సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్
- స్వేరోస్
- Comments Off on ‘అథ్లెటిక్స్’ సెమినార్లో స్వాములు ప్రతిభ