సారథి న్యూస్, మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. మెదక్ పట్టణం, చిన్నశంకరంపేట, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు కేక్‌లు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సేఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో మెదక్ నియోజకవర్గంలో రూ.వేలకోట్ల ఖర్చుతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. కాళేశ్వరం జలాలు కూడా అందుబాటులోకి వస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఇఫ్కా డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, లింగారెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- January 6, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BLOOD DONATE
- CM KCR
- DEVENDARREDDY
- HARISHRAO
- medak
- MLA PADMA
- పద్మాదేవేందర్ రెడ్డి
- మెదక్
- సీఎం కేసీఆర్
- సేఫ్ హాస్పిటల్
- హరీశ్‌రావు
- Comments Off on అట్టహాసంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు