Breaking News

అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలి

అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, రామగుండం: ఉత్తరప్రదేశ్ హత్రాస్​లో దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్ యూ) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రామగుండం ప్రధాన చౌరస్తా వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎల్ యూ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ సీహెచ్ శైలజ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని బాపూజీ కలలుగన్నారని గుర్తుచేశారు. మహిళలు ఒంటరిగా తిరగలేకపోతున్నారని అన్నారు. యూపీలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోశిక ప్రకాష్, ప్రదీప్, శ్రీనివాస్, నరసయ్య, రవి, అరుణ్, చందర్, రాజ్ కుమార్, సంతోష్, వరలక్ష్మి, శ్రీధర్, వెంకటేశ్వర్లు, విద్య పాల్గొన్నారు.