సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల గురించి కమిషనర్ పట్టించుకోవడంలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. 14వ వార్డులో పర్మిషన్లేకుండా నిర్మిస్తున్న ప్రహారీని గురువారం సీపీఐ బృందం పరిశీలించింది. రోడ్డుకు సెట్ బ్యాక్ ఇస్తూ ఇండ్లను కట్టుకోవాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు. పరిశీలించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, సీపీఐ నాయకులు జాగీర్ సత్యనారాయణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పుల బాలమల్లు, యెడల వనేశ్, కొయ్యడ కోమురయ్య ఉన్నారు.
- June 25, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- CPI
- HUSNABAD
- కలెక్టర్
- సీపీఐ
- హుస్నాబాద్
- Comments Off on అక్రమ నిర్మాణాలను పట్టించుకోరా..?