Breaking News

అక్రమంగా ప్రవేశిస్తే చర్యలు

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై కట్టడి ఎక్కువ చేశారు.  జోగుళాంబ గద్వాల రెడ్ జోన్ గా ఉన్నందున అక్కడి నుంచి వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత మండలాలకు పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే కేసులు పెడతామని ఆత్మకూరు సీ​ఐ సీతయ్య హెచ్చరించారు. జూరాల ప్రాజెక్టు వద్ద గేటు తాళాలు విరగ్గొట్టి ఆత్మకూరు అమరచింత మండలం రాత్రిపూట అక్రమంగా వస్తున్నారని దీనిపై నిఘా ఉంచి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.