సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యంను పరిమితి స్థాయిలో సరఫరా చేసుకోవచ్చని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మద్యం విక్రయించడం ద్వారా సులువుగా డబ్బు సంపాదించాన్న లక్ష్యంతో పెద్దమొత్తంలో తెంగాణ, కర్ణాటక నుంచి కొందరు మద్యం తెప్పిస్తున్నారు. గురువారం కర్నూలు మండలం జి.సింగవరం గ్రామం వద్ద సీఐ రాజశేఖర్ గౌడ్ నేతృత్వంలో పోలీసు వాహనాలను తనిఖీచేయగా పెద్దమొత్తంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. కల్లూరు మండలం దూపాడుకు చెందిన బోయ నాగగణేష్, సిందే గణపతి అక్రమంగా తరలిస్తుండగా.. 265 ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వారి బైక్ను సీజ్ చేశారు. దాడుల్లో ఎస్సై స్వామినాథన్, పద్మనాభం, లీలా మోహన్, సుధాకర్ రెడ్డి, నరసింహులు పాల్గొన్నారు.
- September 3, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- ANDRAPRADESH
- KARNATAKA
- LIQUORSUPPLY
- ఆంధ్రప్రదేశ్
- కర్ణాటక
- తెలంగాణ
- మద్యం సరఫరా
- Comments Off on అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత