Breaking News

అక్టోబర్ 2న స్వచ్ఛత దినోత్సవం

అక్టోబర్ 2న స్వచ్ఛత దినోత్సవం

సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్ ​శాఖ తరఫున జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని అక్టోబర్​2న స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. గాంధీజీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన ఆయా కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ​చైర్మన్లు, కమిషనర్లు, అడిషనల్​ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ బి పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసొస్తే ప్రజలకు అద్భుతమైన సేవలు అందించే అవకాశం వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మున్సిపాలిటీల్లో పబ్లిక్​ టాయిలెట్స్​ను నిర్మించాలని సూచించారు. ఆస్తిపన్ను వసూలుకు సంబంధించి ప్రభుత్వం కల్పించిన వన్​టైమ్​ సెటిల్​మెంట్​ కార్యక్రమాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు మంత్రి స్పష్టంచేశారు.