సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. భారీ పారితోషికాన్ని అందుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. నయన్ దాదాపు ఇండస్ట్రీకొచ్చి పన్నెండేళ్లు దాటుతోంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చింది నయనతార. రాను రానూ క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. సినిమా రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న నయన్ పేరు ప్రేమ, పెళ్లి విషయాల్లో అప్పుడప్పుడూ వార్తల్లో వినిపిస్తోంది. అయితే నయన తార ఓ సినిమా చేశాక ఆ చిత్ర ప్రమోషన్‌కు కానీ, దానికి సంబంధించిన ఏ ఈవెంట్ కు అటెండ్ కాదు. ఆ విషయాలను సినిమా సైన్ చేసే ముందే ప్రొడ్యూసర్, డైరెక్టర్ తో చెప్పి మరీ సైన్ చేస్తుంది. దానికి కారణం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది..
‘నా మనసులోని భావాలు ప్రపంచానికి చెప్పడం ఇష్టం లేదు. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడం నాకిష్టం ఉండదు. నేను సినిమాల గురించి మాట్లాడాలంటే అవే నా గురించి చెబుతాయి. మొదట్లో నేను కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను.. అప్పుడు నేను మాట్లాడిదిన దానిగురించి తప్పుగా రాశారు. దానివల్ల నేను చాలా ఇబ్బందులకు గురయ్యేదాన్ని.. అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేశాను..’ అంటూ అసలు విషయం చెప్పింది. ప్రస్తుతం నయన్ తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ అనే చిత్రాలను చేస్తోంది.