Breaking News

అంతా రాముడి దయతో..

అంతా రాముడి దయతో..

ముంబై: అయోధ్యలో రామమందిరం నిర్మాణం శుభపరిణామమని శివసేన అభిప్రాయపడింది. ప్రధాని చేతుల మీదుగా బుధవారం భూమిపూజ చేయాల్సిన మంచి క్షణం మరొకటి లేదని, శ్రీరాముని దయ వల్ల కరోనా కనుమరుగు అవుతోందని చెప్పింది. రామమందిర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బీజేపీ సీనియర్‌‌ నేతలు ఎల్‌కే. అద్వానీ, మురళీ మనోహర్‌‌ జోషీ వయోభారం వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతారని చెప్పింది. అయోధ్యలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారని, హోం మంత్రిత్వ శాఖ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

ఇలాంటి సమయంలో అమిత్‌ షా కరోనా బారిన పడటం దురదృష్టకరమని, ఆయన త్వరగా కోలుకోవాలని కోలుకుంటున్నామని శివసేన చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎక్కడ ఉన్నా చక్రం తిప్పగలరని శివసేన అభిప్రాయపడింది. ఆయన ఐసోలేషన్‌లో ఉన్నా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌కు చుక్కలు చూపించగలడని సంచలన వ్యాఖ్యలు చేసింది. షాకు కరోనా పాజిటివ్‌ వచ్చిన అంశంపై తమ పత్రిక సామ్నాలో పేర్కొంది.