జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే రాకుమారి పాత్ర పోషిస్తున్నట్టు ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ చారిత్రకమా.. లేక సోషియోఫాంటసీ చిత్రమా అన్నవిషయంపై క్లారిటీ లేదు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టాలని భావిస్తున్నది చిత్ర యూనిట్. లాక్‌డౌన్‌కు ముందు జార్జియాలో కొంతభాగం చిత్రీకరించారు. అయితే కరోనాతో అక్కడ షూటింగ్ నిలిపివేశారు. త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టు టాక్.
- August 23, 2020
- Archive
- సినిమా
- MOVIE
- PANINDIA
- POOJAHEGDE
- PRABHAS
- RADHESHYAM
- పాన్ఇండియా
- ప్రభాస్
- రాధేశ్యామ్
- Comments Off on అంత:పుర కాంతగా పూజాహెగ్డే!