Breaking News

సన్‌రైజర్స్‌.. రెండో‘సారీ’!

సన్‌రైజర్స్‌.. రెండో‘సారీ’!

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా అబుదాబి వేదికగా శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో జరిగిన మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్​ఆర్​హెచ్​) ఓటమి పాలైంది. కాగా ఇది సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో పరాజయం. గత మ్యాచ్ లో ఆర్సీబీతో ఓడిపోయింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్‌ 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది. కేకేఆర్‌ జట్టులో శుబ్‌మన్‌ గిల్‌ 70 (నాటౌట్‌*), నితీష్‌ రాణా 26, ఇయాన్‌ మోర్గాన్‌ 42 రాణించడంతో మూడు వికెట్ల నష్టానికి 18 ఓవర్లలో 145 పరుగులు చేసి విజయాన్ని అందించారు. ఎస్ఆర్ హెచ్​బౌలర్లు కేకే అహ్మద్, టి.నటరాజన్, రషిద్​ఖాన్​ఒక్కో వికెట్ చొప్పున పడ్డాయి.

అంతకు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ​జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. వార్నర్​ 36, ఎంకే పాండే 51, వైపీ సాహా 30, మహ్మద్​ నబి 11 రెండంకెల స్కోరు మాత్రమే చేయగలిగారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేయగలిగారు. ఇక కేకేఆర్ బౌలర్లు పీజే కమిన్స్, సీవీ వరుణ్, అండ్రు రస్సెల్​ఒక్కో వికెట్​చొప్పున తీశారు. శుబ్‌మన్‌ గిల్‌ ప్లేయర్​ఆఫ్​ది మ్యాచ్​గా నిలిచారు.