Breaking News

రాళ్లు చేసే మ్యాజిక్ అదుర్స్

రాళ్లు చేసే మ్యాజిక్ అదుర్స్

బ్యూటీ వరల్డ్ రోజురోజుకూ మారుతోంది. అందుకు కారణం అందరికీ బ్యూటీ కాన్షియస్ పెరగడమే. అందుకే అందానికి మెరుగులు దిద్దడానికి రోజుకో కొత్త ప్రొడక్ట్​మార్కెట్​లోకి వస్తోంది. వారానికో బ్యూటీ టూల్ రిలీజ్​అవుతోంది. అలా ఇటీవల బ్యూటీ వరల్డ్​లో అడుగుపెట్టిన ‘గువా షా’ మసాజ్ టూల్ బాగా పాపులర్​అయింది. ఈస్ట్ ఏషియన్​దేశాల్లో ఎప్పట్నుంచో వాడకంలో ఉన్న ఈ టూల్​కు ప్రస్తుతం మన ఇండియన్​ మార్కెట్​లోనూ డిమాండ్ పెరుగుతోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​లేకుండా గ్లోయింగ్ అండ్ హెల్దీ స్కిన్​ఇచ్చే ఈ ‘గువా షా’ టూల్​గురించి మరిన్ని విషయాలు.

ఎప్పట్నుంచో ఉంది
చైనా, జపాన్​లాంటి దేశాల బ్యూటీ ట్రీట్​మెంట్​లో ‘గువా షా’ మసాజ్​ టూల్​ను చాలా ఏళ్ల నుంచి వాడుతున్నారు. మొదట్లో ఈ మసాజ్​ టూల్ ను కండరాలు, తొడ, వెన్ను నొప్పులు నుంచి రిలీఫ్​కి వాడేవాళ్లు. బాడీ రిలాక్సేషన్​కి కూడా గువా షా స్టోన్స్​తోనే ట్రీట్​మెంట్​ తీసుకునేవాళ్లు. కానీ, రానురాను ఈ నేచురల్ స్టోన్స్ ఇస్తున్న రిజల్ట్​ని చూసి ముఖంపైనా ప్రయోగాలు చేశారు. అవి గ్రాండ్ సక్సెస్​అవడంతో ఈస్ట్ ఏషియన్​కంట్రీస్ట్​లో గువాషాను బ్యూటీ ట్రీట్​మెంట్స్​లో భాగం చేశారు. అక్కడ్నుంచి నెమ్మదిగా మన దేశానికి వచ్చిందీ టూల్. మన దేశంలోని చాలా కంపెనీలు డిఫరెంట్ షేప్స్​ఉన్న రాళ్లతో ఫేషియల్ గువాషా కిట్​ను రిలీజ్​చేస్తున్నాయి.

లాభాలెన్నో..
ఫేషియల్ గువా షాతో ముఖం, మెడ భాగాల్లో మసాజ్​చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది. ముఖంపై చర్మం మృదువుగా మారడంతో పాటు స్కిన్​టోన్​కూడా మెరుగుపడుతుంది. ముడతలు, డార్క్​సర్కిల్స్​ సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. అలాగే వారానికి మూడుసార్లు ఒకనెలపాటు గువాషా టూల్​తో మసాజ్​ చేస్తే స్కిన్ సెల్స్​కూడా వృద్ధి చెందుతాయి. చర్మానికి నేచురల్​హీలింగ్ పవర్​పెరుగుతుంది. ముఖంపై చర్మాన్ని టైట్​గా ఉంచుతుంది. ఈ టూల్​తో ఇరవైనిమిషాలు పాటు మాసాజ్​చేస్తే టెన్షన్​నుంచి కూడా బయటపడొచ్చు. గ్లోయింగ్ స్కిన్​ని కూడా సొంతం చేసుకోవచ్చు.

ఎలా వాడాలి?
ముందుగా చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసి మెత్తటి టవల్​తో తడి మొత్తం పొయ్యేలా తుడవాలి. తర్వాత ఆరుఏడు చుక్కల నచ్చిన ఫేషియల్ ఆయిల్ తీసుకుని ముఖం, మెడ భాగాలకి బాగా పట్టించాలి. ఇప్పుడు గువాషా స్టోన్​ను అరచేతులతో రుద్దుతూ కాస్త వేడిచేయాలి. దాంతో చర్మంపై మృదువుగా మసాజ్​చేయాలి. నుదిటితో మొదలుపెట్టి గడ్డం కింది భాగం వరకు ఒకే డైరెక్షన్​లో మసాజ్​చేయాలి. కళ్ల కింద, చెవి వెనకభాగం, చెంపల దగ్గర సర్క్యులర్ మోషన్​లో మూడు నిమిషాల పాటు పదిసార్లు మసాజ్​చేయాలి. మసాజ్​కు అనువుగా మసాజ్​ రోలర్స్​కూడా మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. కావాలంటే వాటిని కూడా ట్రై చేయొచ్చు.

ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
ఫేషియల్ గువాషా స్టోన్స్​లో చాలా రకాలు ఉంటాయి. మన స్కిన్​టోన్​ని బట్టి వాటిని ఎంచుకోవాలి. ఎక్కువగా ఆకుపచ్చ, గులాబీ రంగు గువా షాలు ఎంచుకోవడం మంచిది. ప్లాసిక్​ వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు.
::: ఎన్​ఎన్​