Breaking News

రాజస్తాన్​ మరోసారి..!

రాజస్తాన్​ మరోసారి..!

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆదిలోనే రాజస్తాన్‌ చతికిలపడింది. రాజస్తాన్‌ బ్యాట్స్​మెన్లు యశస్వి జైస్వాల్‌ 34(36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ 24(17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ 13(8 బంతుల్లో 2 ఫోర్లు), రాహుల్​తెవాటియా 38(29 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) మినహా మిగతావారు రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఓటమి బాటపట్టింది. ఇక ఢిల్లీ బౌలర్లలో స్టోయినిస్‌, అశ్విన్‌, రబడాలు చెరో రెండు వికెట్లు సాధించారు. హర్షల్‌, నోర్త్‌జే, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హెట్‌మెయిర్‌ 45(24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు) రన్స్​చేశారు. మార్కోస్‌ స్టోయినిస్‌ 39(30 బంతుల్లో 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ 22(18 బంతుల్లో 4 సిక్స్‌లు) పరుగులు చేశారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు సాధించగా, కార్తీక్‌ త్యాగి, ఆండ్రూ టై, రాహుల్‌ తెవాటియా చెరో వికెట్​తీశారు.