సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): పేక ఆట ఆడుతూ పట్టుబడ్డ ఘటన మందమర్రి లో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సమయంలో సింగరేణి సబ్ స్టేషన్ వెనుకవైపు గల అటవీ ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో యుక్తంగా అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు మిట్టపల్లి బాబు, గుడి కందుల ఓదెలు, దుర్గం రవి, మొయ్య రాంబాబు, సిద్దినాథ్ కిరణ్ లను అదుపులోకి తీసుకోని, వారి వద్ద నుండి 8860 రూపాయలు స్వాధీన పరచుకుని ఇట్టి వక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది లేదని చట్టపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- October 24, 2022
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- లోకల్ న్యూస్
- ARREST
- MANCHIRYALA
- mandamarri
- Poker
- POLICE
- stones
- Comments Off on పేకాటరాయుళ్ల అరెస్ట్