
సారథిన్యూస్, ఆసిఫాబాద్: మావోయిస్టలు తెలంగాణలోకి ప్రవేశించారని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తర్యాని మండలపరిధిలోని అడువుల్లో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఓ అగ్రనేత, రాష్ట్రకమిటీ సభ్యుడు మైలవరకు అడెల్లు అలియాస్ భాస్కర్ త్రుటిలో తప్పించుకున్నట్టు సమాచారం. కాగా పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ అడవిని జల్లెడ పడుతున్నారు. పోలీసులకు విప్లవసాహిత్యం, మావోయిస్టుల యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు, కార్దెక్స్ వైర్లు, పాలితిన్ కార్పెట్స్ తదితర మొదలైనవి పోలీసులకు లభ్యమయ్యాయి.