
దుబాయ్: ఐపీఎల్13 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ ఘోరంగా ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చతికిలపడింది. ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు విఫలమవడంతో ఆర్సీబీ 97 రన్స్‌తేడాతో ఓటమిని చవిచూసింది. ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్(20), డివిలియర్స్(28), వాషింగ్టన్ సుందర్(30), శివం దూబే(12) రెండంకెల స్కోరు మాత్రమే చేయగలిగారు. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో రవి బిష్నోయ్, మురుగన్ అశ్విన్ చెరో మూడు వికెట్ల చొప్పున సాధించగా, షెల్డాన్ కాట్రెల్ రెండు వికెట్లు తీశాడు. ఇక షమీ, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. 62 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ పూర్తిచేశాడు. రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేయడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఏ అగర్వాల్ 26(20 బంతుల్లో), ఎన్పూరన్ 17(18 ంతుల్లో), కేకే నాయర్15( 8 బంతుల్లో.. నాటౌట్) చొప్పున నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లు ఎస్దుబే రెండు, వైఎస్చాహల్ఒక వికెట్చొప్పున తీశారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.