–ఎమ్మెల్యే రవిశంకర్
సారథి న్యూస్, రామడుగు : సమగ్ర వ్యవసాయ విధానం ద్వారానే సత్పలితాలు వస్తాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని షానగర్ లో ‘సమగ్ర వ్యవసాయ విధానం.. వానాకాలం పంటసాగు ప్రణాళిక’ పై రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న నిల్వలు ఉన్నాయని, ఏ రైతు కూడా మొక్కజొన్న పంట వేయకూడదని సూచించారు. 40 శాతం సన్నరకాలు, 60 శాతం దొడ్డు రకాలు వేయాలన్నారు.
ఆధునాతన పంటల కు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. వరి, పత్తితోపాటు పప్పుధాన్యాలైన కంది, పెసరతోపాటు కూరగాయలు సాగుచేయడంతో వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని వివరించారు. ఏడీ రామారావు మాట్లాడుతూ.. మొక్కజొన్న పంట వానాకాలం వేయొద్దని యాసంగిలో సాగుచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం, వ్యవసాయశాఖ సిఫార్సు చేసిన రైతులు వారి, నేలలకు అనువైన రకాలను సాగుచేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మానస, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి, టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.