- రోజు 500 మంది ముస్లింలకు ఫుడ్
కత్రా: కరోనా నేపథ్యంలో క్వారంటైన్లో ఉన్న 500 మంది ముస్లింలకు స్పెషల్గా ఇఫ్తార్, సహర్ను అందిస్తోంది మాతా వైష్ణోదేవీ ఆలయ బోర్డు.. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలంతా రోజా ఉంటున్నందున వారి కోసం స్పెషల్గా ఫుడ్ తయారుచేసి అందిస్తున్నామని బోర్డు అధికారులు చెప్పారు. రంజాన్ మాసం కారణంగా స్టాఫ్ రాత్రి వేళ పనిచేస్తున్నారని, ముస్లింలకు ఇఫ్తార్, సహరా అందిస్తున్నారని వైష్ణోదేవి ఆలయ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ కుమార్ అన్నారు.
‘ఆశీర్వాద్ భవన్లో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుచేశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను వెనక్కు తీసుకొస్తున్న ప్రభుత్వం వారిని క్వారంటైన్లో ఉంచింది. క్వారంటైన్లో ఉన్న వారిలో ఐదొందల మంది ముస్లింలు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా పొద్దున, సాయంత్రం వంట చేస్తున్నాం’ అని రమేశ్ చెప్పారు. ఆశిర్వాద్ భవన్లోనే కాకుండా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు బోర్డు తరఫున ఫుడ్ అందిస్తున్నట్లు చెప్పారు.