సారథి న్యూస్, రామాయంపేట: పాము చిన్నదైనా పెద్దకర్రతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. 8 అడుగుల పామును చూస్తే ఎవరైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండగా సుమారు 8అడుగుల జెర్రిపోతు పాము కనిపించింది. మొదట్లో దాన్ని చూసి భయపడిన తర్వాత చుట్టుపక్కల రైతుల సహాయంతో కొట్టి చంపారు. పాము చనిపోయిన తర్వాత దానితో కొందరు ఫొటోలు దిగారు.
- June 16, 2020
- మెదక్
- KALVAKUNTA
- SNAKE
- జెర్రిపోతు
- పెద్దపాము
- Comments Off on వామ్మో.. ఏం పామో