సారథి న్యూస్, గోదావరిఖని: వడదెబ్బతో ఓ కాంట్రాక్టు కార్మికుడు వడదెబ్బకు గురై మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా కొత్త సత్యనారాయణ( 49) పనిచేస్తున్నాడు. రైల్వే ట్రాక్ విధులు నిర్వహిస్తూ భోజనం చేసి కుళాయి దగ్గర నీళ్లు తాగడనికి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోవడంతో తోటి కార్మికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
బాధిత కుటుంబానికి ఎన్టీపీసీ జేఏసీ నాయకులు, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ తో చర్చించి రూ.9.30 లక్షలు అందజేశారు. వారిలో కాంట్రాక్టు అసోసియేషన్ నాయకులు ఏబీసీ శ్రీనివాసరెడ్డి, ఎలిని నారాయణ, ఎ. రాజేశం, వెంకటేశ్వరావు, బీజేపీ నేత కౌశిక, హారన్న, చిలుక శంకర్, ఐఎఫ్టీయూ ఇజ్జగిరి, భూమయ్య, టీఆర్ఎస్ శంకర్, సీఐటీయూ నేత లక్ష్మణ్, ఏఐటీయూసీ నేత బి.చందర్, ఐఎన్టీయూసీ బి.శ్రీనివాస్, టీఎన్టీయూసీ నాగభూషణం ఉన్నారు.