అగర్తలా: బాలికలు, యువతులపై అకృత్యాలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలో ఓ యువతి (17)పై ఐదుగురు యువకులు సామూహికంగా లైంగికదాడి పాల్పడ్డారు. ఖోవాయి జిల్లాలోని ఖాసియమంగల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకొని అడవుల్లోకి లాక్కెల్లారు. అనంతరం ఆమెపై పాశవికంగా లైంగికదాడి చేశారు. దీంతో యువతి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా ఆ నరరూప రాక్షసుల కసి చల్లారలేదు. తమ స్నేహితులైన మరో ఇద్దరు యువకులను అక్కడికి పిలిపించి ఆమెపై లైంగికదాడికి ఉసిగొల్పారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు యువకులను వారికి సహాయం చేసిన మరో ఐదుమందిని అరెస్ట్ చేశారు. నిందితులను వెంటనే ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.